Murder Attempt : మహిళా న్యాయమూర్తికి హత్య బెదిరింపు.. కేసు నమోదు

తనకు బెదిరింపు లేఖ వచ్చిందని మహిళా న్యాయమూర్తి ఆరోపించడంతో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధించాడని మహిళా జడ్జి గతేడాది ఆరోపించిన విషయం తెలిసిందే. నెలరోజుల తర్వాత ఆమెకు బెదిరింపు లేఖ వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. హత్యా బెదిరింపు లేఖ వెనుక లైంగిక వేధింపుల ఆరోపణలే కారణమని న్యాయమూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే లైంగిక వేధింపుల కేసు ప్రయాగ్‌రాజ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆమె తెలిపారు. ఎన్వలప్‌పై ఉన్న పేరు, ఫోన్ నంబర్, చిరునామా నకిలీవి కావచ్చని న్యాయమూర్తి చెప్పారు. లేఖ పంపిన పోస్ట్ ఆఫీస్‌లోని సిసిటివి ఫుటేజీని తనిఖీ చేయాలని పోలీసులను కోరారు.
ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న SHO కొత్వాలి నగర్ అనూప్ దూబే భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ధృవీకరించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com