Rahul Gandhi : రాయబరేలితో మా బంధం విడదీయలేనిది : రాహుల్

భారతీయ జనతాపార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి, రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని కూడా చెప్పి ఆసక్తి రేపారు. రాయబరేలి ప్రచారంలో ప్రజల ప్రశ్నలకు రాహుల్ ఆసక్తికరమైన స్పందన ఇచ్చారు.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భం రాయ్ బరేలీతో కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేశారన్న రాహుల్.. ఇది తమడు కర్మభూమి లాంటిదన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ మొన్నటి వరకు పోటీ చేస్తూ వచ్చారు, ఆమె స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు.
ఈ క్రమంలో సోమవారం ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీజేపీ, ఎన్డీయే సర్కారు వైఖరిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక పెళ్లి చేసుకోక తప్పేలా లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. కేరళ వాయనాడ్ ఎంపీ స్థానం నుంచి కూడా మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆయన సిట్టింగ్ ఎంపీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com