Narendra Modi: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ అప్రమత్తం.. మోదీ ఎమర్జెన్సీ మీటింగ్..

X
Narendra Modi: రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్‌తో భారత్ అప్రమత్తమైంది. రెండు దేశాల యుద్ధం, తలెత్తిన సంక్షోభంపై ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుద్ధ పరిణామాలు, భారత్‌పై ఆర్థిక ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఉక్రెయిన్‌లోని భారతీయులను ఇండియాకు తీసుకురావడంపైనా చర్చించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
