National Creators Award: జాబితాలో బ్లాగర్ కమియా జానీ, గాయని మైథిలీ

National Creators Award: జాబితాలో బ్లాగర్ కమియా జానీ, గాయని మైథిలీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ రాజధానిలోని భారత్ మండపంలో మొట్టమొదటి 'నేషనల్ క్రియేటర్స్ అవార్డు'లను అందించారు. ఇది సృజనాత్మకతను సానుకూలంగా మార్చడానికి లాంచ్ ప్యాడ్‌గా భావించబడిందని పేర్కొంది. ఈ అవార్డులు అపారమైన ప్రజాదరణను నోచుకున్నాయి. ఇందులో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు, దాదాపు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి.

అవార్డు పొందిన వారిలో 'గ్రీన్ ఛాంపియన్' విభాగంలో అవార్డు పొందిన పంక్తి పాండే, ఉత్తమ స్టోరీ టెల్లర్‌గా కీర్తికా గోవిందసామి, 'కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు' గాయని మైథిలీ ఠాకూర్, టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్తగా గౌరవ్ చౌదరి ఉన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈ అవార్డ్ స్టోరీ టెల్లింగ్, సోషల్ చేంజ్ అడ్వకేసీ, ఎన్విరాన్‌మెంటల్ సస్టైనబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ గేమింగ్‌తో సహా డొమైన్‌ల అంతటా శ్రేష్ఠతను, ప్రభావాన్ని గుర్తించే ప్రయత్నమని పేర్కొంది. భారత మండపంలో జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందజేశారు.

ఈ అవార్డు 20 విభాగాలలో శ్రేష్ఠులైన వారికి ఇస్తారు:

బెస్ట్ స్టోరీ టెల్లర్

ది డిస్ర్పటర్

సెలబ్రెటీ క్రియేటర్

గ్రీన్ ఛాంపియన్

బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్

మోస్ట్ ఇంఫాక్ట్ ఫుల్ అగ్రి క్రియేటర్

కల్చరల్ అంబాసిడర్

బెస్ట్ ట్రావెల్ క్రియేటర్

స్పచ్ఛతా అంబాసిడర్

న్యూ ఇండియా ఛాంపియన్

టెక్ క్రియేటర్

హెరిటేజ్ ఫ్యాషన్

మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్

బెస్ట్ క్రియేటర్ ఇన్ ఫుడ్ కేటగిరీ

బెస్ట్ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్

ఇంటర్నేషనల్ క్రియేటర్ అవార్డ్

బెస్ట్ క్రియేటర్ ఇన్ గేమింగ్ కేటగిరీ

బెస్ట్ మైక్రో క్రియేటర్

బెస్ట్ నానో క్రియేటర్

బెస్ట్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ క్రియేటర్

Tags

Read MoreRead Less
Next Story