UVIN : ఆగస్టు చివరి నాటికి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి యూ-విన్

'యూ-విన్' పోర్టల్ ను గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ఆగస్టు చివరి నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ నిర్వహణ కోసం రూపొందించిన కో-విన్ తరహాలో రూపొందించిన ఈ ఆన్లైన్ వ్యవస్థను ఇప్పటికే పశ్చిమబెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు.
డిప్తీరియా, మీజిల్స్, రూబెల్లా వంటి అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనేందుకు గర్భిణులు, చిన్నారు లకు అనేక రకాల టీకాలను ప్రభుత్వం అందిస్తోంది. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమం కింద దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రతి టీకా వివరాలను యూ-విన్ లో పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యూ-విన్ను తీసుకువస్తోంది. డిజిటైజేషన్ ప్రక్రియ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లను ఎక్కడనుంచైనా పొందవచ్చు. అంతేకాకుండా ప్రైవేటు కేంద్రాల్లో ఇచ్చే టీకాల నమోదు కూడా వీటిలోనే పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా జులై 9, 2024 వరకు యూ-విన్లో 5.33 కోట్ల వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరా లను పొందుపరిచామని కేంద్ర ప్రభు త్వం వెల్లడించింది. ఆగస్టు చివరి నాటి కి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నట్లు తెలిపింది. వెబ్ పోర్టల్ లేదా యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం పౌరులు స్వయంగా రిజిస్టర్ చేసుకొని, ఆపా యింట్ మెంట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన అలర్టులు మేసేజ్ రూపంలో వస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com