దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గింది .. నీతి అయోగ్ వెల్లడి

దేశంలో  పేదరికం ఐదు శాతం తగ్గింది ..  నీతి అయోగ్ వెల్లడి

దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ సీఈఓ బీబీఆర్ సుబ్రహ్మణ్యం (BBR Subrahmanyam) చెప్పారు. 2022-23 మధ్య కాలంలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) ను ఉదాహరిస్తూ ఈ విషయాన్ని ఆయన తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి అయోగ్ చేసిన సర్వేలో తేలిందన్నారు. 2011-12 నుంచి పోలిస్తే పట్టణాల్లో నెలవారీ సగటు ఖర్చు 33.5 శాతం పెరిగి 3,510 రూపాయలుగా ఉందని, గ్రామాల్లో ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో 50 శాతం కంటే తక్కు ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది.

2004-05 లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చేసే ఖర్చుల్లో 91 శాతం వ్యత్యాసం ఉండేదని, ప్రస్తుతం ఇది 71 శాతానికి తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. ఇది అసమానతల తగ్గింపును సూచిస్తుందని సర్వే పేర్కొంది. ప్రజల్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలు, నెలవారీ ఖర్చు 40.42 శాతం పెరిగి 2,008 రూపా యలుగా ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పండ్లు, పాల వినియోగం బాగా పెరిగింది. ఇది సమతుల్య ఆహార వినియోగానికి సూచికని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్య వంటి ప్రయోజనాలను సర్వలో చేర్చలేదని ఆయన తెలిపారు. ఈ నివేదిక వివరాల మేరకు భారత్లో పేదరికం దాదాపు అదృశ్యమైందని ఆయన చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story