Neha Sharma : పాలిటిక్స్ లోకి చిరుత హీరోయిన్
బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ (Neha Sharma) రాజకీయాల్లోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తు న్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నేహాశర్మ తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ ఈ మేరకు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం బీహార్లోని భాగ ల్పూర్ ఎమ్మెల్యేగా అజయ్ శర్మ ఉన్నారు. మహాఘట్ బంధన్ సీట్ల పంపకంలో భాగంగా తమ పార్టీ భాగల్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తే తన కుమార్తెకు ఈ నియోజకవర్గం నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
“కాంగ్రెస్ కు భాగల్ పూర్ నియోజకవర్గం కావాలి. ఎందుకంటే అది మా పార్టీకి కంచుకోట. ఇప్పుడు సీట్ల పంపకాలపై ఏర్పాటు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేల మా పార్టీకి అవకాశం వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ పై ఆధారపడి ఉంటుంది. పార్టీ నన్ను పోటీ చేయాలని అడిగితే కచ్చితంగా పోటీ చేస్తాను.. లేదా నా కుమార్తే నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.. అన్ని విషయాలకు వెయిట్ చేయాల్సిందే” అని అన్నారు.
కాగా నేహా శర్మ రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. నేహాశర్మ గతేడాది వరకు సినిమాలలో బిజీగా ఉన్నారు. నేహాశర్మ పాలిటిక్స్ లో బిజీ అయితే మాత్రం సినిమాలకు పూర్తిస్థాయిలో దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పొలిటికల్ ఎంట్రీ గురించి నేహాశర్మ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com