PM Modi : నెహ్రూ రికార్డ్ సమం..! మోడీ స్పందన ఇదే!

ప్రతిష్టాత్మక లోక్ సభ ఎన్నికల టైంలో ప్రధాని నరేంద్ర మోడీ టీవీ, పత్రికలకు క్రేజీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆసక్తికర అంశాలపై స్పందిస్తున్నారు. వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ రికార్డును తాను సమం చేయడంపై మోడీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.
తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ‘‘ఒకరు ఎన్ని పర్యాయాలు ప్రధానిగా పనిచేశారన్నది ముఖ్యం కాదు. దేశం ఎంతగా అభివృద్ధి చెందిందన్నది ముఖ్యం. మోడీ మూడు సార్లు, ఐదు సార్లు లేదా ఏడు సార్లు గెలవొచ్చు. 140 కోట్ల మంది ప్రజల దీవెనలు నాకున్నాయి. కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది’’ అని మోడీ చెప్పడం వైరల్ గా మారింది.
ఇస్రో సహా అనేక ప్రభుత్వ సంస్థల విజయాలు, వైఫల్యాలు అన్ని సందర్భాల్లో తాను పక్కనే ఉన్నానని ప్రధాని మోడీ ఆసక్తికరమైన బదులిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com