UP : మేనల్లుడు నా వారసుడు కాదు: మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి కీలక ప్రకటన చేశారు. మేనల్లుడు ఆకాశ్ ఇకపై పార్టీలో తన వారసుడు కాబోడని ప్రకటించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి ఆయనను తప్పించారు. ఆకాశ్ రాజకీయాల్లో పరిపూర్ణత సాధించే వరకు పక్కకు పెడుతున్నానని మాయావతి తెలిపారు. అయితే ఆయన పార్టీ సభ్యుడిగా కొనసాగుతారని పేర్కొన్నారు. కాగా, గత నెలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఆకాశ్‌పై కేసు నమోదు చేసింది.
ఏప్రిల్ 28న, సీతాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఆకాష్ ఆనంద్‌తో పాటు మరో నలుగురు మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో నమోదు చేశారు. ర్యాలీలో ఆనంద్ ప్రసంగాన్ని జిల్లా యంత్రాంగం సుమోటోగా స్వీకరించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ఆనంద్‌తో పాటు, బీఎస్పీ అభ్యర్థులు మహేంద్ర యాదవ్, శ్యామ్ అవస్థి, అక్షయ్ కల్రా, ర్యాలీ నిర్వాహకుడు వికాస్ రాజ్‌వంశీపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సీతాపూర్) చక్రేష్ మిశ్రా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com