New Chief for BJP : డిసెంబర్‌లోగా బీజేపీకి కొత్త చీఫ్?

ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తికానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్‌లో మండల, జిల్లా చీఫ్‌ల నియామకం, డిసెంబర్‌లో రాష్ట్రాధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నిబంధనల ప్రకారం, ప్రతి సభ్యుడు ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ ఏడాది జరగబోయే మెంబర్‌షిప్ క్యాంపెయిన్‌లో ప్రధాని, పార్టీ అధ్యక్షుడు, పార్టీ నేతలు అందరూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. మొదటగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. దీని తర్వాత సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు క్రియాశీల సభ్యత్వం జరుగుతుంది. అక్టోబర్ నుంచి 1 నుండి అక్టోబర్ 15 వరకు, క్రియాశీల సభ్యత్వాలను పరిశీలన చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com