New Election Commissioner : కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, బల్బీర్ సంధు నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ వారిని ఎంపిక చేసింది. ప్యానెల్ సభ్యుడు, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్నికల కమిషనర్ల నియమాక కమిటీలో అధీర్ రంజన్ చౌధురి సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ప్రధాని ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ కొనసాగుతుండగా.. సహాయ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను నియమించారు. సెలక్షన్ కమిటీలో కేంద్రానికే ప్రధాన పాత్ర కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ భేటీ అనంతరం అధిర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేశ్‌ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ సభ్యులుగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా గత నెల ఒక ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com