Legal Acts : జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

Legal Acts  : జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు.

మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి. గతేడాది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్‌ 2023 చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇవి బ్రిటిష్‌ వలసపాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో అమల్లోకి రానున్నాయి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది.

వారు తాము నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.

Tags

Next Story