New Year Special : న్యూ ఇయర్ స్పెషల్.. 'అప్సర' దుస్తులు ధరించిన భారత దౌత్యవేత్త

కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే కంబోడియా అక్కడి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు 'ఖైమర్ అప్సర' సంప్రదాయ దుస్తులను ధరించారు. దీంతో ఈ వేషధారణకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2013లో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు రేకెత్తించిన వివాదంలో చిక్కుకున్న ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఖోబ్రోగాడే 'ఖైమర్ అప్సర' వేషధారణలో ఫొటోషూట్ చేశారు.
"రాయబారి దేవయాని ఖోబ్రగాడే ఖ్మేర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. ఖ్మేర్ నూతన సంవత్సర స్ఫూర్తిని ఆలింగనం చేసుకుంటూ, మన నాగరికతల గొప్ప బంధాన్ని ప్రతిబింబిస్తూ, ఆమె ఖైమర్ అప్సరలా దుస్తులు ధరించింది. మా స్నేహితులందరికీ ఖైమర్ నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను" అని కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం Xలో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలో ఆమె భారీ నగలు, తలకు కిరీటం, సంప్రదాయ దుస్తులు ధరించి, కనిపించారు. అంతేకాదు ఆమె ఈ ఫొటోలు రెండు చేతులు జోడించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com