Nitish Kumar : నీ కాళ్లు మొక్కుతా! బిహార్ సీఎం నితీష్ వ్యాఖ్యలు వైరల్

Nitish Kumar : నీ కాళ్లు మొక్కుతా! బిహార్ సీఎం నితీష్ వ్యాఖ్యలు వైరల్

ఓ రోడ్డు ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రసంగిస్తూ, బీహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బహిరంగ వేదికపై మాట్లాడే క్రమంలో, పెండింగ్లో ఉన్న రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయండి. అవసరమైతే మీ కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా అంటూ ఓ ప్రయివేట్ కంపెనీ ప్రతినిధిని సీఎం నితీశ్ కుమార్ వేడుకున్నారు.

డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని కంపెనీ ప్రతినిధిని కోరారు. అలా మాట్లాడుతూనే సదరు ప్రతినిధి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం పక్కనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులను నివ్వెరపరిచింది. వెంటనే తేరుకుని ముఖ్య మంత్రిని నిలువరించారు. ఈ అనూహ్య పరిణామంపై కంపెనీ ప్రతినిధి వెంటనే స్పందిస్తూ...సార్ సార్.. దయజేసి మీరు అలా చేయకండి.. నా పాదాలను తాకొద్దు అంటూ బిగ్గరగా విజ్ఞప్తిచేశాడు. ఎక్స్ ప్రెస్ వే అయిన జేపీగంగా పాతన్ ను ప్రారంభించడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

గతవారం భూ వివాదాలను పరిష్కరించేందుకు విస్తృత సర్వేలు నిర్వ హించాలని అధికారులకు సూచించే క్రమంలోనూ నితీశ్ ఇలాగే ప్రవర్తించారు. ఐఏఎస్ అధికారి కాళ్లు మొక్కుతానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి అవగాహన లేదనీ.. అందుకే ప్రభుత్వ అధికారులు, కంపెనీ అధికారులు కాళ్లపై పడటానికి సిద్ధంగా ఉన్నారంటూ విమర్శించారు విపక్షనేత తేజస్వీయాదవ్.

Tags

Next Story