Aadhaar Card : జూన్ 14లోగా ఆధార్ అప్‌డేట్ చేయకపోతే పని చేయవా?

Aadhaar Card : జూన్ 14లోగా ఆధార్ అప్‌డేట్ చేయకపోతే పని చేయవా?
X

జూన్ 14లోగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే కార్డులు చెల్లకుండా పోతాయంటూ ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును జూన్ 14 వరకు పొడిగించామని, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వక్రీకరించారని పేర్కొంది. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోనప్పటికీ కార్డులు పనిచేస్తూనే ఉంటాయని తెలిపింది.

కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని సూచించారు. మీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. యూఐడీఏఐ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు లేనప్పటికీ, ఆధార్ సెంటర్‌లో దాన్ని అప్‌డేట్ చేయడానికి మీకు రూ. 50 ఖర్చు అవుతుంది.

ఆధార్‌ కార్డును ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి

స్టెప్‌ 1 : ఆధార్‌ కార్డులను సొంతంగా అప్‌డేట్ చేసుకొనేందుకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

స్టెప్‌ 2 : అనంతరం అక్కడ కనిపించిన లాగిన్‌ బటన్ పైన క్లిక్‌ చేయండి. తర్వాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను సహా ఇతర వివరాలను నమోదు చేయండి.

స్టెప్‌ 3 : అనంతరం అక్కడ కనిపించిన 'Send OTP' పైన క్లిక్‌ చేయండి. తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన 6 అంకెల OTP ని ఎంటర్‌ చేయండి.

స్టెప్‌ 4 : అనంతరం అక్కడ కనిపించిన సర్వీస్ ట్యాబ్‌లో అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ అనే దానిపై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 5 : తర్వాత Proceed to Update Aadhaar అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయండి.

స్టెప్‌ 6 : అక్కడ మీ పేరు మరియు ఆధార్‌ నంబర్‌ కనిపిస్తాయి.

స్టెప్‌ 7 : అనంతరం అవసరమైన డాక్యుమెంట్‌లు అప్‌లోడ్‌ చెయ్యాల్సి ఉంటుంది.

స్టెప్‌ 8 : అన్ని వివరాలను తనిఖీ చేసి సమర్పించాల్సి ఉంటుంది.

Tags

Next Story