Corona Vaccine: గుండెపోటుకు అదే కారణమా..

కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు సురక్షితమైనవేనని పరిశీలన అధ్యయనం తెలిపింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతాలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో కరోనా విజృంభణ తర్వాత గుండెపోటు ముప్పు ఎక్కువగా పెరిగిందనే ఊహగానాలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రభావం గుండెపోటు కేసులు పెరగడానికి ఏదైనా అనే అనుమానాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇండియాలో ఉపయోగించిన కరోనా వ్యాక్సిన్లను.. గుండెపోటు ముప్పు పెరుగదలకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం పేర్కొంది.
ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైంది. భారత్‌లో వ్యాక్సిన్‌లు సురక్షితమని తమ అధ్యయనంలో వెల్లడైంది అంది . భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదని, ఇంకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించామని అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన మోహిత్ గుప్తా వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే, ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని.. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్ ప్రభావం ఏమైనా ఉందా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గతేడాది మన దేశంలోనే ఓ అధ్యయనం జరిగింది. ఇందుకోసం దిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో ఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోనివారే. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com