Cabinet : కేబినెట్‌లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు: రాజదీప్ సర్దేశాయ్

Cabinet : కేబినెట్‌లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు: రాజదీప్ సర్దేశాయ్

భారత రాజకీయాల్లో పదేళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యం తగ్గిందని జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ ( Rajdeep Sardesai ) అన్నారు. ఈసారి మోదీ కేబినెట్‌లో ఒక్క ముస్లిం ఎంపీకి కూడా చోటు దక్కలేదని ట్వీట్ చేశారు. అయితే NDA నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులెవరూ గెలుపొందలేదని, అందుకే వారికి కేబినెట్‌లో చోటు దక్కలేదని కూటమి వర్గాలు అంటున్నాయి. ఈసారి క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారిలో ఐదుగురికి చోటు దక్కింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 24 మంది ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య ఈ ఏడాది రెండుకు తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీరిలో ఒక్క ఎంపీ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి చెందినవారు లేరు. ఈ 24 మంది లోక్‌సభ ఎంపీలలో 21 మంది ఇండియా అలయన్స్‌కు చెందిన వారే కావడం విశేషం.

ఈ జాబితాలో తొమ్మిది మంది ముస్లిం ఎంపీలతో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ముస్లిం ఎంపీలు ఉన్నారు. నలుగురు ముస్లిం ఎంపీలు సమాజ్‌వాదీ పార్టీకి, ఇద్దరు ఇండియన్ ముస్లిం లీగ్‌కు, ఒకరు నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందినవారున్నారు. అలాగే అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎంకు చెందిన ముస్లిం ఎంపీ. ఇద్దరు ముస్లిం ఎంపీలు స్వతంత్రులుగా ఎన్నికయ్యారు.

Tags

Next Story