Vijay Mallya : విజయమాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఇండియన్ బ్యాంక్ నుంచి పొందిన రూ.180 కోట్ల రూపాయల రుణం ఎగవేతకు సంబంధించి కోర్టులో హాజరుపరచాలంటూ, పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై ( Vijay Mallya ) ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
వివిధ బ్యాంకులు రుణాలను ఎగవేసి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించిన రూ.180 కోట్ల
నింబాల్కర్ ఎన్టీడబ్ల్యూను జూన్ 29న జారీ చేసినప్పటికీ పూర్తి ఆదేశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్లో ఉన్నారు. ఆయనను అప్పగించాల్సిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అక్కడ న్యాయపోరాటం కూడా చేస్తోంది.
ఈడీ మనీలాండరింగ్ కేసులు మాల్యాపై నమోదయ్యాయి. 2007-2012 మధ్య కాలంలో ఐఓటి నుంచి పొందిన రుణాలను అప్పుడు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను మళ్లించారని, ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగవేశారని మాల్యాపై అభియోగాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com