North India : ఎండల్లో మండుతున్న నార్తిండియా.. బార్మర్‌లో 48.8 డిగ్రీలు

North India : ఎండల్లో మండుతున్న నార్తిండియా.. బార్మర్‌లో 48.8 డిగ్రీలు

ఉత్తర భారతదేశంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

తీవ్రమైన వడగాలులకు రాజస్థాన్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు రోజు పాటు పలు జిల్లాల్లో ఇవే పరిస్థితులు ఉంటాయని రాజస్థాన్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ వంటి లక్షణాల కారణంగా అనారోగ్యానికి గురై చనిపోతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జలోర్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. బార్మర్ లో ఇద్దరు రోజువారీ కూలీలు మరణించారు. ఇక్కడ ఉష్ణోగ్రత 48.8 డిగ్రీల సెల్సియస్ కు పెరిగింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారంనాడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. కొన్ని ఏరియాల్లో ప్రజలు వడగాలులకు గురై చనిపోతున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఆల్వార్, భిల్వారా, బలోత్రా, జైసల్మేర్లో కూడా తీవ్రమైన వడగాలులు ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి. బాధిత కుటుంబాలకు రిలీఫ్ ప్యాకేజీ అందజేస్తున్నట్లు రాజస్థాన్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కిరోరిలాల్ మీనా ప్రకటించారు. మరో మూడు రోజులు వడగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Tags

Next Story