Rahul Gandhi : సమస్యలకు కాదు.. గ్రాండ్ వెడ్డింగ్ లకే మీడియా ప్రాధాన్యత : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పర్యటన శివపురికి చేరుకుంది. ఆయన రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర చీఫ్ జితూ పట్వారీలతో కలిసి గాంధీ బహిరంగ జీపులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మోదీ ప్రభుత్వంపై దాడికి దిగిన గాంధీ, "గతంలో హెచ్‌సిఎల్, బిహెచ్‌ఇఎల్ వంటి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన సాధారణ కులాల ప్రజలకు అందుబాటులో ఉండేవి. మోదీ ప్రభుత్వం వీటన్నింటికీ ముగింపు పలికింది"అని రాహుల్ ఆరోపించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపేందుకు మీడియా సంపన్న వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ మరోసారి ఆరోపించారు. రైతులు, నిరుపేదలు, దేశంలోని ముఖ్యమైన సమస్యలపై కాకుండా గ్రాండ్‌గా జరుగుతోన్నపెళ్లి వేడుకలపై (అనంత్ అంబానీ & రాధిక మర్చంట్‌లు) మీడియా దారిని మళ్లించి.. అసలు సమస్యలను కప్పి పుచ్చిందని నిందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com