Odisha New CM : ఒడిషా కొత్త సీఎం మోహన్ చరణ్.. ప్రమాణానికి ఏర్పాట్లు

Odisha New CM : ఒడిషా కొత్త సీఎం మోహన్ చరణ్.. ప్రమాణానికి ఏర్పాట్లు
X

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ( Mohan Charan Majhi ) బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం భువనేశ్వర్లో జరిగిన సమావేశంలో బీజేపీ ( BJP ) శాసన సభా పక్ష నేతగా మోహన్ చరణ్ మారీని ఎన్నుకున్నారు బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ప్రకటించడంతో ఇప్పటివరకూ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

బీజేపీ అధిష్ఠానం తరపున పర్యవేక్షకులుగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5గంటలకు జనతా మైదానంలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా.. కేంద్రమంత్రులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Tags

Next Story