Cabinet Approved : వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్రం ఆమోదం

X
By - Manikanta |13 Dec 2024 4:45 PM IST
జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్న కేంద్రం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు అన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తైన వంద రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com