Social Media : లైక్స్ కోంస బైక్‌పై అమ్మాయిల ఓవరాక్షన్..

నేటి యువతకు సోషల్ మీడియానే ప్రపంచం. తెల్లారేకల్లా లక్షల్లో వ్యూస్, లైక్స్, ఫారోవర్స్ కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం యువత ఏది పడితే అది చేస్తున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. కొంతమంది యువత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఇటీవల ఢిల్లీ మెట్రో రైలులో (Delhi Metro Rail) ఇద్దరు యువతులు హోలీ రంగులు పూసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇదే తరహాలో ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఓ సంఘటన జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో బైక్‌పై వెళ్తూ ఇద్దరు యువతులు అసభ్యకరంగా ప్రవర్తించారు. రీల్స్ చేసి.. లైక్స్ సొంతం చేసుకోవాలనీ, ఫేమస్ అవ్వడం కోసం విచ్చలవిడిగా ప్రవర్తించారు. అయితే.. హోలీ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన ఇద్దరు యువతులు ఈ పని చేశారు. ముందు స్కూటర్ ఓ యువకుడు నడుపుతుండగా.. వెనకాలే ఇద్దరు యువతులు కూర్చున్నారు. వారిద్దరు ఎదురెదురుగా కూర్చుని కదులుతున్న బైక్‌పై రంగులు పూసుకున్నారు.
అసభ్యకరరీతిలో హావభావాల్లో మునిగిపోయారు. ఈ వీడియోను రికార్డు చేసి దానికి ఒక హిందీ పాటను కలిపి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లైక్‌లు.. ఫేమస్ అవ్వడం కోసం ఇంత నీచంగా ప్రవర్తించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వీడియోను నోయిడా పోలీసులకు ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలంటూ పలువురు కామెంట్స్ పెట్టారు. స్పందించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారనీ.. వారికి ఈ-చలాన్ విధించారు. ముగ్గురికి కలిపి రూ.33వేలు జరిమానా విధించినట్లు సోషల్ మీడియాలో తెలిపారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com