Yogi Adityanath : అతి విశ్వాసమే ఎన్నికల్లో దెబ్బతీసింది: యోగి

గెలుపుపై అతి విశ్వాసం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) అన్నారు. ‘2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఓట్ల శాతంతో 2024లోనూ గెలుపొందింది. ఈసారి గణనీయమైన మార్పు ఏంటంటే విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో SP 37, బీజేపీ 33, కాంగ్రెస్ 6, ఇతరులు 4 సీట్లలో నెగ్గారు.
మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థంగా పని చేసింది. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొన్నాం. కానీ, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన మార్పు వచ్చింది. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని భాజపా పొందినప్పటికీ.. విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణం అని యోగి పేర్కొన్నారు.
కాగా.. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి 10 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైంది. మరో చోట స్వతంత్ర పార్టీ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితాల అనంతరం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com