Pakistan Attempts To Attack : భారత్‌లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం!

భారత్‌లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్‌తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్‌లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.
పాకిస్థాన్ మిస్సైల్ దాడులకు ప్రతీకారంగా భారత్ ఈ ఉదయం పాక్‌పై విరుచుకుపడింది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలే లక్ష్యంగా అటాక్ చేసింది. ఈ క్రమంలో లాహోర్‌లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటిని పాకిస్థాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్‌కు సరైన సమాధానమిచ్చేందుకు భారత్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
‘ఆపరేషన్ సింధూర్’ను భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలిగొన్న నరరూప రాక్షసులైన ఉగ్రవాదులను ఈ మిషన్ ద్వారా ఏరివేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బిహార్‌లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు ‘సింధూర్’ అని నామకరణం చేసి దేశభక్తి చాటాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com