Speaker Elections : 24 నుంచి పార్లమెంట్ సెషన్.. స్పీకర్ ఎన్నిక

Speaker Elections : 24 నుంచి పార్లమెంట్ సెషన్.. స్పీకర్ ఎన్నిక
X

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్ర మోదీ ( Narendra Modi ) వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ 3.0 కేబినెట్ కూర్పు కూడా పూర్తయింది. మొత్తం 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

దీంతో.. కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఎనిమిది రోజులపాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

జూన్ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు వెల్లడించాయి. జూన్ 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణం స్వీకారం చేస్తారని చెబుతున్నారు.

Tags

Next Story