Price Drop : పెట్రోల్ రేట్లు మరింత తగ్గనున్నాయా..?

చమురు కంపెనీలు పెట్రోల్ రేట్లను తగ్గించాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు రెండు రూపాయలు తగ్గాయి. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
పెట్రోల్ ధరల సవరణ తర్వాత, ప్రధాన నగరాల్లో ఇవి కొత్త రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో ధర రూ.96.72 నుంచి రూ.94.72కి తగ్గింది. ముంబైలో రూ.106.31 నుంచి రూ.104.21కి.. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.3 నుంచి 103.94కి .. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63 నుంచి 100.75కి తగ్గింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.89.62 నుంచి రూ.87.62కి తగ్గింది. ముంబైలో డీజిల్ ధర రూ.94.27 నుంచి రూ.92.15కి .. కోల్‌కతాలో డీజిల్ ధర రూ.92.76 నుంచి 90.76కి.. చెన్నైలో డీజిల్ ధర రూ.94.24 నుంచి 92.34కి తగ్గింది.
తగ్గిన ధరలో డీజిల్‌తో నడిచే 58 లక్షలకు పైగా భారీ వస్తువుల వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత తగ్గుతాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com