Mumbai : ముంబైలో తప్పిన విమాన ప్రమాదం

Mumbai : ముంబైలో తప్పిన విమాన ప్రమాదం

ఫుల్ లోడ్ తో వెళ్తున్న రెండు విమానాలకు ముంబై రన్ వేపై ప్రమాదం తప్పింది. ఒకే రన్వేపై ఓ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఆ వెనుకే మరో విమానం ల్యాండ్ అయ్యింది. రెండింటికి కేవలం అతికొద్ది దూరం మాత్రమే గ్యాప్ ఉండటంతో అంతా హడలెత్తిపోయారు.

ఈ షాకింగ్ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనిపై దర్యాప్తు చేసింది. రన్ నిర్వహణకులపై తక్షణ చర్యలు తీసుకుంది. బాధ్యుడైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ చేసింది. ముంబై ఎయిర్ పోర్టులో రన్ వేపై ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుండగా.. అదే టైంలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. రెండింటికి మధ్య కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. వెంటనే అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.

ఈ వీడియో కూడా వైరల్ అయింది. ఇష్యూను తాము సీరియస్ గా తీసుకున్నామని.. ప్యాసింజర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముంబై ఏవియేషన్ అధికారులు తెలిపారు.

Tags

Next Story