PM KISAN: త్వరలో పీఎం కిసాన్ నిధులు

రైతులకి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM-KISAN) లో భాగంగా 20వ విడత నిధులు జూన్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 19 విడతలలో భాగంగా రూ. 2,000 చొప్పున రూ. 6000 సంవత్సరానికి రైతుల ఖాతాలోకి నేరుగా బదిలీ చేస్తూ వస్తున్న ఈ పథకం, ఫిబ్రవరి 24, 2025న చివరిసారి నిధులు విడుదల చేసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్ లోని సభలో 19వ ఇన్స్టాల్మెంట్ ప్రకటించారు. ఆ విడతలో 9.8 కోట్ల మంది రైతులకు రూ. 22,000 కోట్లు విడుదల చేయగా, అందులో 2.41 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు.
కేవైసీ పూర్తి చేయని రైతులకు నిధులు రావు
పీఎం కిసాన్ 20వ విడత పొందాలనుకుంటున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ, ల్యాండ్ డేటా సీడింగ్, ఆధార్ – బ్యాంకు ఖాతా లింకింగ్ ప్రక్రియలను పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ప్రక్రియలు పూర్తి చేయని రైతులకు ఈ విడతలో రూ. 2000 పొందే అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
పథకం ఉద్దేశం ఏమిటి?
పేద, సన్నకారు రైతుల ఆర్థిక భద్రత కోసం డిసెంబర్ 1, 2018న ఈ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు అందించడం ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 6000 వరకూ నిధులు అందించబడతాయి.
రైతులకు సూచనలు
ఈ-కేవైసీ పూర్తి చేయండి
భూమి వివరాలను ఆధార్‌తో లింక్ చేయండి
బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ చేయడం ఖచ్చితంగా చూసుకోండి
ఈ పద్ధతులన్నీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com