PM Modi : 3 నెలల పాటు 'మన్ కీ బాత్' బంద్

PM Modi : 3 నెలల పాటు మన్ కీ బాత్ బంద్

రేడియో ప్రసార కార్యక్రమం 'మన్ కీ బాత్'పై ప్రధాని మోదీ (Modi) కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. టూరిజం, సామాజిక కారణాలు, ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన కంటెంట్ క్రియేషన్ లో దేశ యువత గొప్పగా ఉందని చెప్పారు.

2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక అదే ఏడాది అక్టోబర్ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా వివిధ అంశాలపై ప్రజలను ఉద్దేశించి తన మనసులోని మాటలను మోడీ పంచుకుంటూ వస్తున్నారు. ఇవాళ ప్రసారం అయిన కార్యక్రమం 110వ ఎపిసోడ్ కాగా ప్రధానిగా మోడీ రెండో టర్మ్ లో ఇదే చివరి మన్ కీ బాత్ ప్రసంగం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన.. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించారు. ఈ బ్రిడ్జ్ పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్ పాత్ కూడా ఉంది. ఈ తీగల వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకా తో అనుసంధానిస్తుంది.

దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉన్నాయి. వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ వి ద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్ట ణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో సుదర్శన్ వంతెన ఉంది. ద్వారకా దీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్లో మోదీ ఈవంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Tags

Read MoreRead Less
Next Story