PM Modi : కీర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi : కీర్ స్టార్మర్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
X

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాదించిన లేబర్ నేత కీర్ స్టార్మర్ కు ( Keir Starmer ) భారత్ ప్రధాని మోదీ ( Narendra Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలమధ్య సంబంధాల బలోపేతం కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత్ - యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందించేలా అన్ని రంగాల్లో వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మరింతగా బలపరేంచుందుకు మన సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కన్జర్వేటివ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ కు కూడా మోదీ తన సందేశంపంపారు. సునాక్ అద్భుతమైన నాయకత్వంతో భారత్- యూకే సంబంధాలు బలోపేతం చేయడంలో కృషి చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Next Story