PM Modi : జగ్గీ వాసుదేవ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష

PM Modi : జగ్గీ వాసుదేవ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష

ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ పుర్రెలో ప్రాణాంతక రక్తస్రావం కారణంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని ఓ సీనియర్ వైద్యుడు మార్చి 20న తెలిపారు. "పుర్రెలో రక్తస్రావాన్ని తొలగించేందుకు మార్చి 17న శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ తర్వాత సద్గురుకు వెంటిలేటర్ నుండి రిలీజ్ చేశారు" అని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ నుండి ఒక ప్రకటన పేర్కొంది. అతని పరిస్థితి మెరుగుపడుతోందని, ప్రాణాంతకం ఏమీ లేదని ప్రకటన తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. " సద్గురు జేవీ జీతో మాట్లాడాను. ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో రాశారు.

అంతకుముందు సద్గురు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన హాస్పిటల్ బెడ్ నుండి ఒక వీడియోను కూడా పోస్ట్ చేసారు. "అపోలో ఆసుపత్రిలోని న్యూరోసర్జన్లు నా పుర్రెను చీల్చి, సమస్యను కనుక్కోవడానికి ప్రయత్నించారు, కానీ ఏమీ కనిపించలేదు - పూర్తిగా ఖాళీగా ఉంది. కాబట్టి వారు దాన్ని వదిలేసి, పాచ్ చేసారు. ఇక్కడ నేను ఢిల్లీలో పాచ్-అప్ పుర్రెతో ఉన్నాను. కానీ మెదడు కాస్త దెబ్బతిన్నది" అని అతను చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story