PM Modi : నేడు కన్యాకుమారికి ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మధ్యాహ్నం 3 గంటల వరకు ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు అక్కడ భద్రతను పెంచారు. 2వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ఆయన కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే.
వివేకానంద రాక్ మెమోరియల్.. సముద్రానికి దగ్గర్లో ఉంటుంది. అందువల్ల తీరప్రాంతం మొత్తం భద్రతా బలగాల చేతిలోకి వెళ్లిపోయింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బలగాలు కూడా అక్కడ మోహరించాయి. ప్రధాని మోదీ.. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరే ధ్యానం చెయ్యడానికి ప్రత్యేక కారణం ఉంది. పురాణాల ప్రకారం అక్కడున్న రాయిపై కన్యాకుమారి దేవి తపస్సు చేసింది. అలాగే.. ఆ రాయి, వివేకానందస్వామి జీవితంపై కూడా మంచి ప్రభావం చూపిందనీ అందుకే ప్రధాని మోదీ ఆ రాయిపై ధ్యానం చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com