PM Modi : ఏనుగు సవారీ చేసిన ప్రధాని మోదీ

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అస్సాంకు వెళ్లిన ప్రధాని.. కజిరంగా పార్క్ లో ఏనుగు సవారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం.
ఆయన జోర్హాట్లో లెజెండరీ అహోమ్ జనరల్ లచిత్ బర్పుకాన్ 125 అడుగుల 'శౌర్య విగ్రహం' ప్రారంభించనున్నారు. రూ. 18వేల కోట్లతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక మోదీ నిన్న సాయంత్రం తేజ్‌పూర్ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి విశ్రాంతి తర్వాత కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. ఇక మోదీ ఇక్కడి నుంచి ఇటానగర్‌కు వెళ్లనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com