PM Modi : మోదీ ప్రమాణ స్వీకారం.. మిత్రదేశాల నేతలకు ఆహ్వానం

PM Modi : మోదీ ప్రమాణ స్వీకారం.. మిత్రదేశాల నేతలకు ఆహ్వానం
X

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్రదేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల నేతలు ఉన్నారు. మోదీ ఇప్పటికే నేపాల్ పీఎం ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమసింఘేను సంప్రదించారు. నేడు సంబంధిత దేశాల నేతలు అందరికీ అధికారికంగా ఆహ్వానం పంపించొచ్చని సమాచారం. కాగా ఈ వారంలోనే మోదీ ప్రమాణస్వీకారం ఉండనుంది.

ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయించనున్నారు. బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని పలు పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రుల సంఖ్య లోక్‌సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు. మంత్రి మండలి సభ్యులను ప్రధాని సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రులుగా నియమితులయ్యే వారికి పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి. లేకుండా మంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రమాణం చేసిన 6 నెలల్లోపు సభ్యత్వాన్ని పొందాలి.

Tags

Next Story