AAP : ఆప్ నిరసనలు.. పోలీసులు అదుపులో ఇద్దరు పంజాబ్ మంత్రులు

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు భారీ నిరసన చేపడుతున్నందున, దేశ రాజధానిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం వెలుపల 144 సెక్షన్ విధించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన సీఎం కేజ్రీవాల్‌ను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలోని ఐటీఓ వద్ద ఆప్ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి, ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్‌లను పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల గొంతును మూయించడం బీజేపీకి తెగించిన ఎత్తుగడ అని గతంలో ఆప్ నేతలు పేర్కొన్నారు. "ఢిల్లీ సీఎంని వారు ఎటువంటి ప్రశ్నలను అడగలేదు. ఎన్నికలు సమీపిస్తున్నందున, బీజేపీ భయపడుతోంది, అది భయాందోళనలో ఉంది. ప్రధానమంత్రిని ప్రశ్నిస్తున్నారని ప్రతిపక్షాల గొంతును మూసివేయడానికి, ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు’’ అని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం నేడు సమావేశం కానుంది. ఈరోజు తెల్లవారుజామున, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ కోసం కేజ్రీవాల్ అభ్యర్థనను కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com