Pratibha Patil : ప్రతిభా పాటిల్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో జాయిన్

Pratibha Patil :  ప్రతిభా పాటిల్ కు  అస్వస్థత..  ఆసుపత్రిలో జాయిన్
X

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి పుణేలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్‌ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు.

గతేడాది ప్రతిభా పాటిల్ భర్త దివిసింగ్ షేకావత్ (89) హార్ట్ ఎటాక్ కారణంగా కన్నుమూశారు. ఇక ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

Tags

Next Story