Priyanka Gandhi : లోక్ సభ ఎన్నికల్లో .. పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ?

Priyanka Gandhi : లోక్ సభ ఎన్నికల్లో ..   పోటీకి దూరంగా ప్రియాంకా గాంధీ?

ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ స్థానంలో బరిలో దిగాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్న తరుణంలో వారిని నిరాశపరిచే వార్త ఒకటి పార్టీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రియాంకకు అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదట. ఆమె కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సీటు నుంచి పోటీ చేయకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రియాంక అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

మరోవైపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాలు గాంధీ కుటుంబానికి బలమైన కోటలుగా ఉన్నాయి. రాహుల్ గాంధీ 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందగా, 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2019లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక రాయ్‌బరేలీలో 2004 నుంచి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానాన్ని ఖాళీ అయింది.

అమేథీ నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తో్ంది. ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అమేథీ, రాయ్‌బరేలీలో మే 20న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఫలితాలను జూన్ 4న వెల్లడించనునన్నారు.

Tags

Read MoreRead Less
Next Story