Project Cheetah : భారత్‌కు మరో 8 చిరుతలు

Project Cheetah : భారత్‌కు మరో 8 చిరుతలు
X

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి. దేశంలో చిరుత ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని, అందులో 67 శాతం మధ్యప్రదేశ్‌లో చిరుత పునరావాసానికి వెళ్లిందని అధికారులు తెలియజేశారు. ‘ప్రాజెక్ట్ చీతా’ కింద చిరుతలను రాజస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలోకి దశలవారీగా తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి మధ్యప్రదేశ్‌.. రాజస్థాన్ మధ్య అంతర్-రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటుచేయడానికి సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు.

Tags

Next Story