Rajya Sabha MP Seats : 10 రాజ్యసభ ఎంపీ సీట్లకు త్వరలో ఎన్నిక?

దేశవ్యాప్తంగా 10 మంది రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ 10 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అసోం, బీహార్, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.
కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ (అసోం), మీసా భారతి, వివేక్ కుమార్ (బీహార్), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), దీపేందర్ సింగ్ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.
అటు బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూలై 10వ తేదీన ఎన్నికలు, జూలై 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com