Radhika Merchant : ఎంబ్రాయిడరీ లెహంగాలో తళుక్కుమన్న రాధిక

Radhika Merchant : ఎంబ్రాయిడరీ లెహంగాలో తళుక్కుమన్న రాధిక
X

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ నెల 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షస్ సెంటర్లో జరగనుంది. ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వివాహ వేడుకల్లో భాగంగా కీలక ఘట్టాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. గుజరాతీ వివాహాల్లో నిర్వహించే మామేరు వేడుక ఇటీవలే జరిగింది. ముంబైలోని యాంటిలియోలో ఈ వేడుకలు జరిగాయి. గుజరాతీ సంప్రదాయం ప్రకారం కాబోయే కోడలికి అత్త మామలు స్వీట్లు, బహుమతులు అందించారు. ఈ మామేరు వేడుక వధువు, వరుడు ఇంట్లో వేరు వేరుగా జరుగుతుంది. వరుడి వైపు నుంచి నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె సోదరి మమతా దలాల్, ఇతర సన్నిహిత బంధువులు వధువును ఆశీర్వదించారు. పనేటర్ చీర, ఆభరణాలు, బ్యాంగిల్స్, స్వీట్స్, డ్రైఫ్రూట్స్ వధువుకు బహుమతిగా అందించారు. ఈ వేడుకలలో రాధిక మర్చంట్ ఎంబ్రాయిడరీ లెహంగాలో మరింత అద్భుతంగా కనిపించింది. ఆరెంజ్, పింక్ షేడ్స్ తో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాలో ముస్తాబైంది. బంగారు నెక్లెస్, మ్యాచింగ్ జుంకాలు, బ్యాంగి ల్స్, ఇంకా స్పెషల్ హెయిర్ స్టైల్ తో అదరగొట్టింది. ఈ వేడుకకు తన తల్లి ఆభరణాలను ధరించి స్పెషల్ అట్రాక్ష న్ గా నిలిచింది.

Tags

Next Story