Nominations : నామినేషన్‌కు ముందు అయోధ్యకు రాహుల్, ప్రియాంక?

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రూట్ మార్చి హిందూ సెంటిమెంట్ ను పండించబోతున్నారా.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎప్పుడూ శివనామ జపం చేసే రాహుల్ ఈసారి రామనామం జపించనున్నారని టాక్.
ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. గాంధీ కుటుంబసభ్యులే ఈ స్థానాల నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అయోధ్య రాముడి సందర్శనకు వెళ్తారట. వయనాడ్ నుంచి రాహుల్ వరుసగా రెండోసారి పోటీ చేస్తన్నారు. శుక్రవారం నుంచి అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది.
అమేఠీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు బలంగా కన్పిస్తున్నాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ. దానికి రెండు రోజుల ముందే రాహుల్, ప్రియాంక వేర్వేరుగా నామినేషన్ వేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రచారానికి ముందు అయోధ్యకు వెళ్లి రాముడి దర్శనం చేసుకుంటారని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com