Congress : కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా రాహుల్ గాంధీ

Congress : కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా రాహుల్ గాంధీ
X

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 99 ఎంపీ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ గత 10ఏళ్లలో మొదటిసారి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందనుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ హోదాను స్వీకరించాలని పార్టీలోని ఓ వర్గం బలంగా కోరుతోంది. నేడు జరిగే CWC, పార్లమెంటరీ పార్టీ భేటీల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు CWC భేటీ జరగనుంది. ఉ.11గంటలకు ఇది మొదలుకానుంది. ఈ భేటీకి సోనియా, ప్రియాంక, రాహుల్‌తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందరికీ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది.

లోక్‌సభ ఎన్నికల్లో నంబర్ల పరంగా తన ప్రీ పోల్ అంచనాలు తప్పాయని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము BJPకి 300 సీట్లు వస్తాయని చెబితే 240 వచ్చాయని పేర్కొన్నారు. ‘ప్రజల్లో మోదీపై తీవ్ర వ్యతిరేకత లేదు. BJP ఓటు శాతం యథాతథంగా ఉంది. ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ మద్దతుదారుల్లో మాత్రమే రాహుల్ ఇమేజ్ పెరిగింది. ఆ పార్టీకి ఇప్పుడు వచ్చిన సీట్లు(99) INC చరిత్రలోనే మూడో అతి తక్కువ సీట్లు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags

Next Story