Rahul Gandhi Assets : రాహుల్ గాంధీకి రూ. 49 లక్షల అప్పు.. కారు కూడా లేదట

లోక్‌సభ ఎన్నికలకు రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. తన ఎన్నికల అఫిడవిట్ లో రూ. 4.2 లక్షల విలువైన బంగారంతో సహా రూ. 20 కోట్లకు పైగా ఆస్తులను తన పత్రాల్లో ప్రకటించారు, అయితే తనకు ఎలాంటి నివాసం కానీ కారు లేదని తెలిపాడు.
తన చేతిలో రూ.55,000 నగదు .. రూ.4,20,850 విలువైన 333.3 గ్రాముల బంగారం ఉన్నట్లుగా తెలిపాడు. అంతేకాకుండా రూ. 49,79,184 అప్పు ఉన్నట్లుగా వెల్లడించాడు. ఇక, వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26న అక్కడ పోలింగ్ పూర్తయ్యింది.
ఇదే సమయంలో అమేథీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కిశోరీ లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గానికి వచ్చిన ప్రియాంక గౌరీగంజ్‌లోని పార్టీ కార్యాలయంలో శర్మతో సమావేశమై, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో ఐదో రౌండ్‌లో మే 20న పోలింగ్ జరగనున్న స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో రాహుల్, కిశోరీ లాల్ శర్మ నామినేషన్ దాఖలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com