Rahul Gandhi : దేశంలో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాటే : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఎన్నికల వేళ కనీసం పోస్టర్లు వేసుకోలేకపోతున్నామన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాటే అని అన్నారు. సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు ఇలా చేయడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం నేరపూరిత చర్య అని దుయ్యబట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించట్లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి తలెత్తిందని రాహుల్ గాంధీ అన్నారు. నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నామని తెలిపారు. విమాన ప్రయాణాల సంగతి తర్వాత.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ తమ వద్ద డబ్బుల్లేవని చెప్పారు. దేశంలో 20శాతం ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని.. కానీ రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నామన్నారు.
బీజేపీకి రూ.వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం ప్రజల నుంచి న్యాయబద్ధంగా సేకరించిన నిధులను ఐటీ ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com