Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్ గాంధీ.. అందే సౌకర్యాలివే

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లను గెలుచుకోవడంతో రాహుల్ గాంధీకి ( Rahul Gandhi ) విపక్ష నేత హోదా దక్కింది. దీంతో ఆయనకు కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు అందుతాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, Z+ కేటగిరీ భద్రత, పార్లమెంట్‌లో ఆయనకో కార్యాలయం, బంగ్లా, సిబ్బంది ఉంటారు. లోక్‌సభ ముందు వరుసలో తొలి సీటు కేటాయిస్తారు. EC ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు, CBI, ED, విజిలెన్స్ కమిషన్ చీఫ్‌లను నియమించే కమిటీలో రాహుల్ కీలకంగా వ్యవహరిస్తారు.
2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండు దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. వాస్తవానికి 1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు.
దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు, హోదా దక్కనున్నాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, జడ్+ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్ బిల్డింగ్‌లో ఆయనకో కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com