Rahul Gandhi : నా మాటలు రికార్డుల్లో రీస్టోర్ చేయండి.. స్పీకర్‌కు రాహుల్ రిక్వెస్ట్

Rahul Gandhi : నా మాటలు రికార్డుల్లో రీస్టోర్ చేయండి.. స్పీకర్‌కు రాహుల్ రిక్వెస్ట్
X

తన ప్రసంగంలోని వ్యాఖ్యలను తొలగించడాన్ని ప్రశ్నిస్తూ స్పీకర్ కు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) లేఖ రాశారు. సోమవారం రాహుల్ ప్రసంగంలోని కొన్ని పదాలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దాదాపు 14 పదాలను తొలగించినట్లు తెలుస్తోంది. తొలగించిన భాగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాల నుండి కొన్ని వ్యాఖ్యలను తొలగించే అధికారాలు చైర్ కు ఉంటాయని, అయితే అలాంటి పదాలను ప్రత్యేక సందర్భంలో వాడొచ్చనే నిబంధన కూడా ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రస్తావించిన రాహుల్, ఆయన ఎన్ని ఆరోపణ లు చేసినా ఒక్క పదాన్ని కూడా తొలగించలేదని గుర్తుచేశారు.

ఇలా ఎంపికచేసిన వ్యాఖ్యలను తొలగించడం సరికాదని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు రాహుల్. సభా కార్యకలాపాలు నుంచి అభ్యంతర వ్యాఖ్యలను తొలగించే అధికారం సభాపతికి ఉంటుంది. అయితే, లోక్సభ నిబంధనల ప్రకారం రూల్ 380 కింద కు వచ్చే పదాలను మాత్రమే తొలగించే హక్కు ఉంటుంది. కానీ నేను చేసిన ప్రసంగంలో రూల్ 380కిందకు వచ్చే పదాలు వాడలేదు. అయినప్పటికీ, నా ప్రసంగంలో గణనీయమైన భాగాన్ని తీసివేయబడిన విధానం ఆశ్చర్యానికి గురిచేసింది. నేను వాస్తవ పరిస్థితులను, నిజాలను మాత్రమే సభలో చెప్పాను.

ఆర్టికల్ 105(1)లో పొందుపరిచిన విధంగా, ప్రతి సభ్యునికి వాక్ స్వాతంత్య్రం ఉందని రాయబరేలీ ఎంపీ రాహుల్ చెప్పారు. అంతకు ముందు పార్లమెంట్ సమవేశాల కు వెళ్లేముందు, ఈ అంశంపై మీడియాతో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోడీ తన ప్రపంచంలోని నిజాలను తొలగించగలరు కానీ, వాస్తవ ప్రపంచం లోని నిజాలను తొలగించలేరని అన్నారు. తాను ఏంచెప్పినా అది పూర్తిగా నిజమని నొక్కిచెప్పారు. వారు ఎంతకావాలంటే అంత తొలగించుకోవచ్చని, చివరకు నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Tags

Next Story