Bharat Jodo Nyaya Yatra : వారణాసి నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం

కాంగ్రెస్ (Congress) అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫిబ్రవరి 17న ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ నియోజకవర్గం వారణాసి నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర (బీజేఎన్‌వై)ని పునఃప్రారంభించారు. ఈ రోజు ఇది గోల్గడ్డ ప్రాంతం నుండి యాత్రను తిరిగి ప్రారంభమైంది. ఆ తరువాత కాశీలోని బాబా విశ్వనాథ్ ఆలయంలో రాహుల్ గాంధీ ప్రార్థనలు చేయనున్నారు.
తన యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వారణాసిలోని నైపుణ్యం కలిగిన కళాకారులతో చర్చలు జరపనున్నారు. గోల్గడ్డ క్రాసింగ్ నుండి తన యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ విశేష్‌గంజ్ మార్కెట్, మైదాగిన్ క్రాసింగ్ మీదుగా వెళతారు. కాంగ్రెస్ నాయకుడు కాశీ విశ్వనాథ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం గోదోలియా క్రాసింగ్‌కు చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
'ప్రధాని మోదీ నియోజకవర్గమే కాకుండా, వారణాసి పుణ్యక్షేత్రం, పురాతన గ్రంథాలలో పేర్కొన్న నగరం కూడా రాహుల్ సందర్శించనున్నారు.. ఇటీవల రాహుల్ గాంధీ ఐదు అంశాలకు సంబంధించి న్యాయం చేస్తామన్న వాగ్దానానికి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com