Raja Singh : రాహుల్ ఇంకా పప్పులాగే ఉన్నాడు.. రాజాసింగ్ కౌంటర్

Raja Singh : రాహుల్ ఇంకా పప్పులాగే ఉన్నాడు.. రాజాసింగ్ కౌంటర్
X

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ( Rahul Gandhi ) రాజకీయ అవగాహన లేదంటూ, అందుకే ఆయన్ను అందరూ పప్పు అంటుంటారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభలో సోమవారం రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రత్యేకంగా ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

అర్థరహితమైన వ్యాఖ్యలు చేసి, రాహుల్ గాంధీ తనకు సెన్స్ లేదని నిరూపించుకున్నారన్నారు రాజాసింగ్. ఒక ప్రతిపక్ష నేత హోదాలో తగిన విధంగా మాట్లాడలేని రాహుల్ గాంధీ, హిందువు వల్లనే దేశం సురక్షితంగా ఉందనే విష యాన్ని తెలుసుకోవాలని సూచించారు. వెంటనే రాహుల్ గాంధీ హిందూవులం దరికి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

చట్ట సభల్లో రాహుల్ ఇలాగే మాట్లాడితే, రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మునిగి పోతుందని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు మద్దతునిస్తున్న అన్ని పార్టీలు కనుమరుగైపోతాయని రాజాసింగ్ జోస్యం చెప్పారు. హిందూత్వం అంటే ఏంటో సోనియాను అడిగి తెలుసుకోవాలని రాహుల్ కి హితవు పలికారు.

Tags

Next Story