Rahul Gandhi : రాహుల్ స్పీచ్.. ట్రైలర్ మాత్రమే: కాంగ్రెస్

Rahul Gandhi : రాహుల్ స్పీచ్.. ట్రైలర్ మాత్రమే: కాంగ్రెస్
X

లోక్‌సభలో రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ప్రసంగంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో పరిణితితో, బాధ్యతాయుతంగా, హుందాగా తమ నాయకుడు మాట్లాడారని ప్రశంసిస్తున్నాయి. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు చూపిస్తారని హస్తం నేతలు పేర్కొంటున్నారు. అటు రాహుల్‌కు ఏమీ తెలియదనే వారు నేటి నిర్మాణాత్మక విమర్శలు చూస్తే ఆలోచన మార్చుకుంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రాహుల్ కామెంట్స్‌ను ఖండిస్తూ ‘హిందూ’ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న సభలో దీనిపై ప్రధాని మోదీ పెద్దగా స్పందించలేదు. ఇవ్వాళ ఆయన ప్రసంగిస్తారని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దీంతో రాహుల్‌పై మోదీ విరుచుకుపడే అవకాశం ఉంది.

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటి? జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయారు. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా మోదీ చెప్పారు. నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే చెప్పాడా? అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారు’ అని మండిపడ్డారు.

Tags

Next Story